కళ్యాణ్ జ్యువెలర్స్ లో పేలిన ఏసీ.. ముగ్గురికి గాయాలు

కళ్యాణ్ జ్యువెలర్స్ లో పేలిన ఏసీ..  ముగ్గురికి గాయాలు

కర్ణాటకలోని బళ్లారిలో  ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ స్టోర్‌లో  ఎయిర్‌ కండిషనర్‌ (ఏసీ)పేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జ్యువెలరీ షోరూమ్‌లోని ఏసీ సిస్టమ్‌లో గ్యాస్‌ నింపేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.   

ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా ఏసీ పేలడంతో కిటికీ అద్దాలు ఎక్కడికక్కడ పగిలిపోయాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఏసీ పేలడంతో దుకాణంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.