Aa Okkati Adakku Twitter Review: అల్లరి నరేష్ హిట్టు కొట్టాడా.. ఆ ఒక్కటి అడక్కు మూవీ ఎలా ఉందంటే?

Aa Okkati Adakku Twitter Review: అల్లరి నరేష్ హిట్టు కొట్టాడా.. ఆ ఒక్కటి అడక్కు మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adakku). జాతిరత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించాడు. చాలా కాలం తరువాత అల్లరి నరేష్ నుండి వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక టీజర్, ట్రైలర్ కూడా మంచి ఫన్ జెనరేట్ చేయడంతో సినిమా చూడటానికి ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. 

ఎట్టకేలకు ఈ సినిమా నేడు(మే 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పల్లు చోట్ల ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి ఆ ఒక్కటి అడక్కు సినిమా ఎలా ఉంది? ట్విట్టర్ ఆడియన్స్ సినిమా గురించి ఏమంటున్నారు? అల్లరి నరేష్ హిట్టు కొట్టాడా అనేది తెలుసుకుందాం. 

ట్విట్టర్ వేదికగా ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వస్తోంది. సినిమా బాలేదని, కథా కథనం ఆకట్టుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ కూడా అస్సలు వర్కౌట్ అవలేదని చెప్తున్నారు. పాత కథ, వీక్ ప్రెసెంటేషన్, బోరింగ్ స్క్రీన్ ప్లే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో పరవాలేదు సినిమా ఒకసారి చూసేయొచ్చు అని చెప్తున్నారు. ఇలా అల్లరి నరేశ్ ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ఆడియన్స్ నుండి నెగెటీవ్ టాక్ వస్తోంది. మరి పూర్తి టాక్ తెలియాలంటే మార్నింగ్ షో అయ్యేవరకు ఆగాల్సిందే. మరి మీరు ఈ సినిమా చూశారా.. చూస్తే ఎలా అనిపించింది కామెంట్ చేయండి.