బిగ్​బాస్​ విన్నర్ అభిజిత్

బిగ్​బాస్​ విన్నర్ అభిజిత్
‘బిగ్‌‌బాస్‌‌’ సీజన్‌‌–-4లో యంగ్ యాక్టర్ అభిజిత్ విన్నర్ గా నిలిచాడు. 105 రో జులపాటు సాగి న ఈ షో ఫినాలే ఆదివారం జరిగింది. సినీ తారల సందడి మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి హీరో చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి విన్నర్ అభిజిత్ కు ట్రోఫీ, రూ.50 లక్షల ప్రైజ్ మనీ అందించారు. అభిజిత్ , అఖిల్ మధ్య గట్టి పోటీ కనిపించిం ది. వ్యూయర్లు అభిజిత్ కు పట్టం కట్టారు. అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. ఫైనల్ రేసులో నిలబడ్డ వారిలో మొదట హారిక బయటకు రాగా.. తర్వాత అరియానా.. సొహైల్ లు వచ్చారు. చివరకు అభిజిత్.. అఖిల్ మధ్య గట్టి పోటీ నిలిచింది. ఎవరు గెలుస్తారోనని.. ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూశారు. హౌస్ లో అడుగుపెట్టిన నాటి నుండి అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లను రక్తికట్టించేలా ఆడడంతో అభిజిత్ కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఉత్కంఠకు తెరదించుతూ అభిజిత్ నే విజేతగా ప్రకటించారు.