మరోసారి కనువిందు చేయనున్న "సూపర్ మూన్"

మరోసారి కనువిందు చేయనున్న "సూపర్ మూన్"

సూపర్ మూన్ మరోసారి కనువిందు చేయనుంది. మరోసారి చంద్రుడు, భూమికి దగ్గరగా రాబోతున్నాడు. సాధారణంగా పౌర్ణమి రోజు 90 శాతం చంద్రుడు కనిపించినపుడు, భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చే సమయంలో ఈ సూపర్ మూన్ లు ఏర్పడుతుంటాయి. అయితే ఇది సాధారణంగా కనిపించే చంద్రుడి కన్నా అత్యంత ప్రకాశవంతంగా, పెద్దదిగా కనిపించడం విశేషం. 2022లో మొత్తం నాలుగు సార్లు సూపర్ మూన్ లు కనిపించే అవకాశం ఉంది. అయితే తాజాగా ఏర్పడుతున్నది మూడోది. నెక్స్ట్ ఆగష్టు 12న కనిపించనుంది. ఆకాశంలో మరోసారి ఆవిష్కృతం కానున్న ఈ అద్భుతం జులై 13 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల పాటు కనువిందు చేయనుందని నాసా వెల్లడించింది. 

చంద్రుడు, భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒక్కోసారి అత్యంత దగ్గరగా ( పెరీజీ), అత్యంత దూరంగా ( అపోజీ) వెళ్తుంటుంది. అయితే సూపర్ మూన్ కనిపించే రోజు చంద్రుడు సాధారణం కన్నా 14 శాతం పెద్దదిగా.. 30 శాతం ప్రకాశవంతంగా కనిపించనున్నట్టు సమాచారం. ఈ సూపర్ మూన్ భారతదేశ కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ( గురువారం) 12.08 నిమిషాలకు ప్రారంభం అవుతుందని నాసా తెలిపింది. అలా వరసగా మూడు రోజుల పాటు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుందట. అయితే సూపర్ మూన్ కు బక్ సూపర్ మూన్, థండర్ మూన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.  చంద్రుడు మామూలు రోజుల్లో కన్నా.. అత్యంత ప్రకాశవంతంగా, పెద్దదిగా కనిపించనుండడంతో దీన్ని సూపర్ మూన్ గా పిలుస్తారు.