V6 News

మనవడికి వయసులేదని ఆగిండు కేసీఆర్.. లేకపోతే…

మనవడికి వయసులేదని ఆగిండు కేసీఆర్.. లేకపోతే…

హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సామాజిక న్యాయం పేరుతో తన కుటుంబ సభ్యులకు మాత్రమే న్యాయం చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్. బుధవారం నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాలులో జరిగిన  బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ బీసీల గోస సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్.. బడుగు బలహీన వర్గాల ప్రజలను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని కావడం కేవలం బీజేపీలొనే సాధ్యమన్నారు. టీఆరెఎస్ లో తండ్రి సీఎం, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, అల్లుడు మంత్రి, కూతురు ఎమ్మెల్సీ..దొడ్డి దారిన కవితను ఎమ్మెల్సీ చేశారన్నారు. కేసీఆర్ మనువడికి వయసు లేదు కాబట్టి ఆగారు. లేదంటే ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేవారన్నారు.

తెలంగాణ వస్తే బడుగుల జీవితాలు బాగువుడుతాయని ప్రజలు ఆశించారు కానీ.. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. టీఆరెస్ ప్రభుత్వం బీసీలను పట్టించుకోవడం లేదని…బడ్జెట్ లో అరకొర నిధులు కేటాయించిన విడుదల చేయరన్నారు. bన్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో బీసీలు టిఆర్ ఎస్ కు బుద్ది చెప్పాలన్నారు. కేసీఆర్ గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టాలన్నారు. దుబ్బాక ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పారని..టీఆరెస్ ను ఓడించాలంటే బీజేపీకే సాధ్యమన్నారు.