నాగర్ కర్నూల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెన్షన్ వేటు వేశారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రేడ్-IV కార్యదర్శి పి. కిషన్, కొల్లాపూర్ మండలం సింగోటం గ్రేడ్-III కార్యదర్శి పి. అర్జునయ్య, కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రేడ్-III కార్యదర్శి ఆర్. ప్రేమచంద్‌లు సస్పెన్షన్కు గురయ్యారు. అలాగే, పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన వంగూరు, కొల్లాపూర్ మండలాల పంచాయతీ అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. విధుల పట్ల ఏ మాత్రం అలసత్వం వహించిన ఉపేక్షించమని అధికారులు హెచ్చరించారు.

