గచ్చిబౌలి, వెలుగు: అత్యవసర డయల్-100 ఫిర్యాదును పట్టించుకోకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్ సస్పెండ్ చేశారు. ఆగస్టు 1 అర్ధరాత్రి గచ్చిబౌలి ఐకియా సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో బాధితుడు డయల్-100కు రెండుసార్లు ఫోన్ చేసి పోలీసు సహాయం కోరాడు.
అయితే ఇన్‌చార్జిగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ ఘటనాస్థలికి వెళ్లకుండా, ‘కాలర్ వల్ల ఇబ్బంది’ అనే కారణంతో రెండు ఫిర్యాదులను మూసివేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సయ్యద్ యూనస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
