అచ్చంపేట, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించి గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశించారు. శుక్రవారం అచ్చంపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనుల అమలు, సంక్షేమ పథకాల పారదర్శక నిర్వహణ, ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
