చార్మినార్: వైభవంగా మహంకాళి ఘటం ఊరేగింపు

చార్మినార్: వైభవంగా మహంకాళి ఘటం ఊరేగింపు

చార్మినార్, వెలుగు: శ్రీ అక్కన్న–మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు డి.ప్రభాకర్, క్రాంతికుమార్ మాట్లాడుతూ.. తానీషా పాలనలో మంత్రులు, సైన్యాధిపతులుగా ఉన్న అక్కన్న–మాదన్నలు ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించారని తెలిపారు. 

అప్పటి నుంచి ఈ ఆలయం శ్రీఅక్కన్న–మాదన్న మహంకాళి దేవాలయంగా ప్రసిద్ధి చెందిందన్నారు. శాలిబండలోని శ్రీకాశీ విశ్వనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఘటం ఊరేగింపు ప్రారంభమైంది.