గోల్కొండ ఎల్లమ్మకు ఆరో పూజ

గోల్కొండ ఎల్లమ్మకు ఆరో పూజ

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోట శ్రీజగదాంబ మహంకాళి(ఎల్లమ్మ తల్లి) ఆలయంలో ఆదివారం ఆరో పూజను వైభవంగా నిర్వహించారు. ఉదయం భక్తుల రద్దీ స్వల్పంగా ఉండగా, మధ్యాహ్నం నుంచి భారీగా తరలివచ్చారు. సాయంత్రం వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. 

ఇక కార్వాన్ సబ్జీమండి మహంకాళి, నల్ల పోచమ్మ ఆలయంలో 14వ వార్షిక బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటానికి కర్నాటక నుంచి తీసుకొచ్చిన ఏనుగు లక్ష్మి ప్రత్యేకంగా స్వాగతం పలకడం ఆకర్షణగా నిలిచింది.