V6 News

కరోనా వాక్సిన్ల వల్లే షేన్‌‌‌‌ వార్న్‌‌‌‌ మృతి!

కరోనా వాక్సిన్ల వల్లే షేన్‌‌‌‌  వార్న్‌‌‌‌ మృతి!

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ షేన్‌‌‌‌ వార్న్‌‌‌‌ మరణంపై ఆయన కుమారుడు జాక్సన్‌‌‌‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి మృతికి కరోనా వ్యాక్సిన్లే కారణమని ఆరోపించాడు. వృత్తిపరమైన నిబంధనల వల్ల వార్న్‌‌‌‌ బలవంతంగా మూడు, నాలుగు డోసుల టీకాలు తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. 

‘నాన్నకు అంతర్గత ఆరోగ్య సమస్యలు ఉండి ఉండొచ్చు. కానీ కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడం వల్లే ఆ సమస్యలు ఒక్కసారిగా తీవ్రమై ప్రాణాంతకంగా మారాయి. నాన్నకు టీకాలు తీసుకోవడం ఇష్టం లేదు. కేవలం పని నిమిత్తం తప్పనిసరి కావడంతో తీసుకున్నారు. సాధారణంగా చాలా మంది 80, 90 ఏళ్ల వయసులోనూ ధూమపానం చేస్తూ ఆరోగ్యంగానే ఉన్నారు. నాన్న కూడా అప్పటికి ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగానే కనిపించాడు. కానీ సడెన్‌‌‌‌గా అలా జరిగిపోయింది’ అని జాక్సన్‌‌‌‌ ఓ పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లో వ్యాఖ్యానించాడు. 

తన తండ్రి సంస్మరణ సభలోనే ఈ విషయాలను మాట్లాడాలని అనుకున్నా.. అప్పటి పరిస్థితుల దృష్ట్యా మౌనంగా ఉండిపోయినట్లు చెప్పాడు.