V6 News

ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ నుంచి.. ఆ జడ్జిని తప్పించండి: కోర్టులో కేజ్రీవాల్ అఫిడవిట్

ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ నుంచి.. ఆ జడ్జిని తప్పించండి: కోర్టులో కేజ్రీవాల్ అఫిడవిట్

ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ నుంచి ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మను తప్పించాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోర్టు అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. జస్టిస్  స్వర్ణకాంత శర్మ ఇద్దరు పిల్లలు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులుగా ఉన్నారని, ఈ కేసుకు సంబంధించిన పనులను  సొలిసిట్ జనరల్ వారికి అప్పగించారని జస్టిస్ శర్మ పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని అవిఫడివిట్ లో తెలిపారు. 

ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులందరిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ రివిజన్ పిటిషన్  ఏప్రిల్ 13న జస్టిస్ ఎస్ కే శర్మ విచారించారు. అయితే విచారణ నుంచి జస్టిస్ శర్మను తప్పించాలని కోరుతూ కేజ్రీవాల్ సహా ఈ కేసులో నిందితులు దరఖాస్తులు దాఖలు చేశారు. ఈ కేసులో స్వయంగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్.. జస్టిస్ శర్మ పిల్లలకు కేంద్ర ప్రభుత్వంతో వృత్తిపరమైన సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని కోర్టుకు తెలిపారు. కేసుకు హాజరయ్యే ఏ వ్యక్తితో అయినా, సంస్థతో అయినా  న్యాయమూర్తుల బంధువులకు సంబంధాలుంటే వారు విచారణనుంచి తప్పుకుంటారని కేజ్రీవాల్ తన అఫిడవిట్ లో  కోర్టుకు తెలిపారు. 

విచారణ ముగిసిన తర్వాత జస్టిస్ శర్మ కుమారుడు, కుమార్తె కేంద్ర ప్రభుత్వ  న్యాయవాదులుగా నియమించినట్లు చూపే రికార్డులు తనకు లభించాయని కేజ్రీవాల్ అదనపు అఫిడవిట దాఖలు చేశారు.  ఆమె కుమారుడు సుప్రీంకోర్టులో గ్రూప్ ఎ ప్యానెల్ న్యాయవాదిగా ఉండగా, ఆమె కుమార్తె గ్రూప్ సి ప్యానెల్ న్యాయవాదిగా ఉన్నట్లు లా రిపోర్టర్ సౌరవ్ దాస్ ప్రజల ముందుకు తీసుకువచ్చిన ఆధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు.