మునుగోడు బైపోల్ కోసం మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఛైర్మన్ గా 16 మంది నేతలతో ఏర్పాటైన బీజేపీ స్టీరింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఈ కమిటీ చర్చలు జరుపుతోంది. మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల వారీగా చేసిన సర్వే నివేదికను నేతలు పరిశీలిస్తున్నారు. గ్రామాల వారీగా కమిటీల నియామకంపై చర్చిస్తున్నారు. మండలాలకు ఇంఛార్జ్ ల నియామకం, ప్రచారం, చేరికలపై కమలం నేతలు ఫోకస్ పెట్టారు.
ఈ భేటీలో స్టీరింగ్ కమిటీ సభ్యులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, రవీంద్ర నాయక్, స్వామిగౌడ్, చంద్రశేఖర్, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, కపిలవాయి, ఆచారి, దాసోజు శ్రవణ్, కమిటీ కో ఆర్డినేటర్ మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఉప ఎన్నిక ప్రచారం, చేరికలు , ప్రచార వ్యూహాలపై చర్చించారు. మునుగోడులో ప్రతి ఓటర్ ను కలిసేలా ప్రచార కార్యాచరణను సిద్ధం చేస్తోంది కమలం పార్టీ.
