చండీగఢ్ మేయర్ గా బీజేపీ అభ్యర్థి సరబ్ జిత్ కౌర్ 

చండీగఢ్ మేయర్ గా బీజేపీ అభ్యర్థి సరబ్ జిత్ కౌర్ 

పంజాబ్-హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సరబ్ జిత్ కౌర్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఓటింగ్ లో 28 మంది పాల్గొనగా... ఆమెకు 14 ఓట్లు వచ్చాయి. దీంతో సరబ్ జిత్ మేయర్ గా ఎన్నికైనట్టు ప్రకటించారు. అయితే ఎన్నిక జరిగిన తీరును తప్పుబట్టిన ఆమ్ ఆద్మీ  పార్టీ కార్పొరేటర్లు గలాటా సృష్టించారు. 45 మంది సభ్యులుండే చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లో... 35 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. 10 మంది నామినేటెడ్ సభ్యులుంటారు. డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో 14 సీట్లు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. 12 సీట్లతో బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉండిపోయింది. మేయర్ రవికాంత్ శర్మ కూడా ఓడిపోయారు. అయితే నామినేటెడ్ సభ్యుల సాయంతో మేయర్ పదవి దక్కించుకుంది బీజేపీ.

మరిన్ని వార్తల కోసం...

 

ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా