పాకిస్తానీల’పై బ్రిటన్‌ సీరియస్‌‌

పాకిస్తానీల’పై బ్రిటన్‌ సీరియస్‌‌

లండన్‌‌: ఇంగ్లాండ్‌‌లో ఉన్న యూకే పాకిస్తానీలు కాశ్మీర్‌‌‌‌ అంశానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనపై ఆ దేశ విదేశాంగ మంత్రి డొమినిక్‌‌ రాబ్‌‌ సీరియస్‌‌ అయ్యారు. ఈ ఆందోళన బాధాకరమని చెప్పారు. “ ఈ దేశంలోగాని, ప్రపంచంలో మరెక్కడైనా గాని ఒక దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి ఆందోళనలు చేయడం మంచిది కాదు. రెండు దేశాల మధ్య టెన్షన్లు తగ్గించడమే మనం చేయాల్సింది” అని రాబ్‌‌ బ్రిటిష్‌‌ పార్లమెంట్‌‌లో చెప్పారు. పాక్‌‌ మద్దతుదారుల దాడిని లండన్‌‌ మేయర్‌‌‌‌ సాధిఖ్‌‌ ఖాన్‌‌ ఖండించారు. ఇటువంటి ఆందోళనలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. యూకేలోని ఇండియన్‌‌ హై కమిషన్‌‌ దగ్గర యూకే పాకిస్తానీలు ఆందోళన నిర్వహించారు.

‘కాశ్మీర్‌‌‌‌ ఫ్రీడమ్‌‌ మార్చ్‌‌’ పేరుతో పార్లమెంట్‌‌ స్క్వేర్‌ నుంచి ఇండియన్‌‌ హై కమిషన్‌‌ వరకు ర్యాలీ చేశారు. యాంటీ ఇండియా ప్లకార్డులు పట్టుకుని ‘ఆజాదీ’, ‘స్టాప్‌‌ షెల్లింగ్‌‌ ఇన్‌‌ కాశ్మీర్‌‌‌‌’ అంటూ నినాదాలు చేశారు. ఇండియన్‌‌ హైకమిషన్‌‌ బిల్డింగ్‌‌పైకి రాళ్లు విసరడంతో కిటికీ అద్దాలు పగిలాయి. ఘటనకు బాధ్యులైన ఇద్దర్ని  అరెస్టు చేసి కస్టడీకి పంపినట్లు మెట్రోపాలిటన్‌‌ పోలీసు అధికారి చెప్పారు.