ఆగి ఉన్న బస్సులో పేలుడు..ఇద్దరికి గాయాలు

ఆగి ఉన్న బస్సులో పేలుడు..ఇద్దరికి గాయాలు

జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్ లో వరుస పేలుళ్లు జరిగాయి. రాత్రి పదిగంటల ప్రాంతంలో ఉదంపూర్ లోని పెట్రోల్ బంకు దగ్గర ఆగి ఉన్న బస్సులో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలో పార్క్ చేసిన ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని జిల్లా హాస్పిటల్ కు తరలించారు. స్పాట్ లో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

ఫస్ట్ బ్లాస్ట్ జరిగిన కొద్దిసేపటికే... ఉదంపూర్ లో రెండో పేలుడు జరిగింది. బస్సు పేలుడు జరిగిన ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలోనే సెకండ్ బ్లాస్ట్ జరిగింది. డోమైల్ చౌక్ దగ్గరున్న బస్సులో పేలుడు జరిగింది. రెండో బ్లాస్టింగ్ లో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. బ్లాస్టింగ్ జరిగిన పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. పేలుళ్ల ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. స్పాట్ లో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.