UPA కంటే 2.8% తక్కువకు NDA రాఫెల్ డీల్ : CAG

UPA కంటే 2.8% తక్కువకు NDA రాఫెల్ డీల్ : CAG

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కమ్ప్రోట్రోలర్  అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రిపోర్టును కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. యూపీఏ ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం కంటే 2.86 శాతం తక్కువకే డీల్ కుదిరినట్టు కాగ్ తన రిపోర్టులో వివరించింది. 9శాతం తక్కువ ఒప్పందం చేసుకున్నామని గతంలో ఎన్డీఏ ప్రభుత్వం తెలిపింది. యూపీఏ హయాంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 126 యుద్ధ విమానాలు కొనుగోలు చేసే బదులు… ఇండియా ప్రత్యేకంగా వృద్ధి చేసిన సాంకేతితకను ఉపయోగించి 36 రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ ల కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న కాంట్రాక్ట్ లో 17.08 శాతం డబ్బు ఆదా అయిందని కాగ్ వివరించింది.

పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టిన 140 పేజీల రాఫెల్ డీల్ లో 30 పేజీల్లో రాఫెల్ డీల్ గురించి ప్రస్తావన ఉంది.

2012-2017 మధ్య యూపీఏ హయాంలో చేసుకున్న 5 ఒప్పందాలు… ఎన్డీఏ హయాంలో జరిగిన 6 ఒప్పందాలను కాగ్ పొందుపరిచింది.

కేంద్ర షిప్పింగ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పాన్ రాధాకృష్ణన్ కాగ్ రిపోర్టు ప్రతులను సభముందు ప్రవేశపెట్టారు. లోక్ సభ, రాజ్యసభ 11 గంటలకు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలతో అడ్డుకున్నారు. రెండు సభలు ముందుగా 12 గంటలకు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత 12 గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో సీన్ మారలేదు. దీంతో.. 12.30కు వాయిదాపడింది.