Meenaakshi Chaudhary: విర‌హాగ్నితో మీనాక్షి డార్క్ థీమ్ ఫోటోషూట్..ఇంట‌ర్నెట్ని నమ్ముకున్న కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్!

Meenaakshi Chaudhary: విర‌హాగ్నితో మీనాక్షి డార్క్ థీమ్ ఫోటోషూట్..ఇంట‌ర్నెట్ని నమ్ముకున్న కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్!

కుర్రాళ్ల కలల రాణి మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary) తాజా పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన  డార్క్ థీమ్ ఫొటోల్లో అదిరిపోయింది.అంతేకాదు..ఈ ఫోటో షూట్తో కుర్రాళ్ల గుండెల్ని బెదరగొట్టింది.మీనాక్షి బ్లాక్ టాప్ లో  చాలా అట్ట్రాక్టీవ్ గా కనిపిస్తోంది. తాను ఎంపిక చేసుకున్న ఈ స్పెషల్ డిజైన‌ర్ డ్రెస్ కి త‌గ్గ‌ట్టుగానే బాబ్డ్ హెయిర్ స్టైల్..మినిమ‌ల్ మేక‌ప్ తో మీనాక్షి సంథింగ్ స్పెష‌ల్ గా నిలిచింది.

అలాగే ఈ డార్క్ థీమ్ ఫోటోషూట్ కోసం బ్యూటీ మీనాక్షి ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో..వయ్యారాలతో ఫోజులిచ్చింది. ఈ తరహా మత్తెక్కించే పిక్స్ను అమ్మడు చాలా సార్లు పోస్ట్ చేసింది. కానీ, ప్ర‌స్తుతం మీనాక్షి చౌద‌రి డార్క్ థీమ్ ఫోటో షూట్ ఇంట‌ర్నెట్ ని..దాన్ని నమ్ముకున్న కుర్రాళ్ళ హార్ట్ ని బ్రేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మీనాక్షి చౌదరి సినిమాల విషయానికి వస్తే.. 

ప్రస్తుతం మీనాక్షి వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..ఆతరువాత హిట్ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. గ్లామర్ షోకు ఏమాత్రం వెనుకాడని మీనాక్షి.. ఆ తరువాత మంచి అవకాశాలు వస్తాయని ఆశించింది. కానీ, అలా జరుగలేదు. తరువాతి ఆఫర్ కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. రవితేజ తో ఖిలాడీ సినిమా చేశాక మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. 

ఇటీవల మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించిన మీనాక్షి చేతిలో ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. వాటిలో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమా ఉందని సమాచారం. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి, వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న GOAT సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే వ‌రుణ్‌తేజ్‌తో మ‌ట్కాతో పాటు,  ల‌క్కీ భాస్క‌ర్,సింగ‌పూర్ సెలూన్, విశ్వ‌క్‌సేన్‌తో మ‌రో మూవీని అంగీక‌రించింది మీనాక్షి చౌద‌రి.