బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ ప్రమాదంలో.. 36కు చేరిన మృతుల సంఖ్య

బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ ప్రమాదంలో.. 36కు చేరిన మృతుల సంఖ్య

    కంబోడియాలో దారుణం

    మృతుల్లో 13 మంది మహిళలు, ఆరుగురు పిల్లలు

సదరన్‌‌‌‌‌‌‌‌ కంబోడియాలోని సీసైడ్‌‌‌‌‌‌‌‌ కెప్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ కూలిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 36 కు చేరింది. బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో చిక్కుకున్న 23 మందిని ప్రాణాలతో కాపాడారు. దాదాపు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేపట్టిన సిబ్బంది శిథిలాల్లో చిక్కుకున్న ఒక కుక్కపిల్లను ఆదివారం బయటకు తీశారు. చనిపోయిన వారిలో 13 మంది ఆడవాళ్లు, ఆరుగురు పిల్లలు ఉన్నారని కంబోడియా ప్రధాని హన్‌‌‌‌‌‌‌‌సేన్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమాదంలో చనిపోగా..  ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియాలో నిర్మాణ రంగం వేగం పుంజుకుంటోంది. పెద్ద ఎత్తున హోటళ్లు, కాసియోనోలను కడుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 2 లక్షల మంది అన్‌‌‌‌‌‌‌‌స్కిల్డ్‌‌‌‌‌‌‌‌ లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలే జరుగుతున్నాయి. గత ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో బీచ్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌లోని బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ కూలిపోవడంతో 28 మంది చనిపోయారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి