Hari Hara Veeramallu: వీరమల్లు నుండి క్రిష్ తప్పుకున్నాడా.. పోస్టర్పై కొత్త డైరెక్టర్ పేరు గమనించారా?

Hari Hara Veeramallu: వీరమల్లు నుండి క్రిష్ తప్పుకున్నాడా..  పోస్టర్పై కొత్త డైరెక్టర్ పేరు గమనించారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న మొదటి పాన్ ఇండియా అండ్ పీరియాడికల్ డ్రామా మూవీ హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu). భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం(AM Rathnam) నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) తెరకెక్కిస్తుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ పొలిటికల్ కాంపైన్ కారణంగా లేట్ అవుతూ వస్తోంది.

అంతేకాదు.. ఆ మధ్య ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ, నిర్మాత ఏఎం రత్నం మాత్రం ఆ వార్తలను ఎప్పటికప్పుడు కందిస్తూనే ఉన్నాడు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేసి అందరికి షాకిచ్చారు మేకర్స్. అంతేకాదు.. సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్న రూమర్స్ కు అదే లెవల్లో కౌటర్ వేశారు. ఇక టీజర్ కూడా సెక్సీ లెవల్లో ఉండటంతో ఆడియన్స్ లో ఈ సినిమాపై అంచనాలు మళ్ళీ పెరుగుతున్నాయి. 

అయితే తాజాగా విడుదల చేసిన టీజర్ పోస్టర్ లో దర్శకుడిగా క్రిష్ తో పాటు ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పేరు కూడా కనిపించింది.  దాంతో ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్నాడని.. ఆ స్థానంలో జ్యోతి కృష్ణను తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తీస్తే మొత్తంగానే తీసేయాలి కానీ, మళ్ళి ఆయనపేరు ఎందుకు వేశారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే.. ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్న మాట నిజమే కానీ, దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నాడేమో అనే అనుమానం కలుగుతోంది.

ఇక దర్శకుడు జ్యోతి కృష్ణ విషయానికి వస్తే. దర్శకుడిగా ఆయనకు ఇప్పటివరకు ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. మొదటి సినిమా హీరో తరుణ్ తో నీ మనసు నాకు తెలుసు చేశాడు. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఆతరువాత గోపీచంద్ తో ఆక్సీజన్, ఇటీవల కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ సినిమాలు చేశాడు. ఆలాంటి దర్శకుడికి పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమా భాధ్యతలు అప్పగించడం అంటే సాహసమనే చెప్పాలీ. అందుకే క్రిష్ ను ప్రాజెక్టు నుండి పూర్తిగా తీసేయకుండా.. దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారని టాక్. మరి ఇన్ని మలుపులతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.