మండుతున్న ఎండలకు పిక్కలు పీకుతున్న కుక్కలు

మండుతున్న ఎండలకు పిక్కలు పీకుతున్న కుక్కలు

ఎండల ప్రభావం మనుషులతో పాటు పెంపుడు జంతువులపై కూడా తీవ్రంగా పడుతోంది. మండుతున్న ఎండలకు వీధి కుక్కలతో పాటు ఇంట్లో పెంచుకునే కుక్కలు కూడా పిచ్చి కుక్కల ప్రవర్తిస్తున్నాయి. అంతేకాదు వేడి ప్రతాపానికి సరైన సమయంలో నీళ్లూ,ఆహారం,చల్లని వాతావరణం దొరక్క..వీధుల్లో తిరిగే మనుషులు, వాహనాలపై వెళ్లుతున్న ప్రయాణికులను వెంటపడ మరీ కరుస్తున్నాయి. దీంతో కాలనీల్లో కాలినడకన వెళ్లాలంటే జనం జక్కుతున్నారు. సీటీలో ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో చూసినా కుక్క కాటు బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఉస్మానియా, ఫీవర్ లాంటి పెద్ద ఆస్పత్రుల్లో ఎక్కువ శాతం కేసులు కుక్క కాటు బాధితులే ఉంటున్నారు. ఫీవర్ ఆస్పత్రిలో వారం రోజులుగా అవుట్ పేషెంట్ కేసుల్లో 40 శాతం కేసులు కుక్క కాటువే ఉంటున్నాయి.

మరోవైపు సిటీలో కుక్కలు ఇంతలా రెచ్చిపోతులన్నా..జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే కుక్క కాటు బారీన పడుతున్నామని ఆరోపిస్తున్నారు. ఉయదం మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో కుక్కులు కరుస్తున్నాయని.. బాధితులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్యం, స్థానిక కార్పోరేటర్స్ చర్యలు తీసుకోవాట్లేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు. కుక్కలను చూసి జనం భయపడుతున్నారని చెబుతున్నారు. సిటీలో ఏ సందు చూసినా కుక్కలే.. ఏ కాలనీలో చూసినా కుక్క కాటు బాధితులే కనిపిస్తున్నారు.

రాత్రి తోపాటు పగలు కూడా ఇంటి నుండి బయటి రావాలంటే జనం భయంతో వణికిపోతున్నారు. పట్టణ ప్రాంతాలే కాదు.. పల్లెలోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో ఒంటరిగా బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. కాగా, ప్రతీ సమ్మర్ లో కుక్క కాటు బాధితులు పెరుగుతున్నారు. 2022 గణాంకాల ప్రకారం కుక్క కాటు కేసుల్లో రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది కుక్క కాటు బాధితులే ఉంటున్నారు. కుక్క కాటు వల్ల వచ్చే ర్యాబిస్ వ్యాధిని నిర్లక్ష్య చేస్తే చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు.