Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..ఓపెనింగ్ డే కంటే మూడో రోజే ఎక్కువ

Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..ఓపెనింగ్ డే కంటే మూడో రోజే ఎక్కువ

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్(Sathya Dev) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ(Krishnamma). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన లేటెస్ట్ ఫిల్మ్ కృష్ణమ్మ.  దర్శకుడు వి.వి.గోపాల కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ మే 10న థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు చూపిస్తోంది. 

కృష్ణమ్మ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 

సత్యదేవ్ కృష్ణమ్మ మూవీ రిలీజైన మూడో రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు అరుణాచల క్రియేషన్స్ బ్యాన‌ర్‌  అధికారికంగా వెల్లడించింది. “కృష్ణమ్మ బాక్సాఫీస్ ర్యాంపేజ్ విజయవంతంగా కొనసాగుతోంది.ఈ మూవీ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‍గా రూ.3.6 కోట్ల గ్రాస్ వచ్చింది” అని పోస్ట్ చేసింది. 

ఇక కృష్ణమ్మకి ఫస్ట్ డే రూ.కోటి గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే, రోజురోజుకు సినిమాపై వస్తున్న ఆదరణ..థియేటర్స్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా బాగుండటంతో రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. రెండో రోజు కలెక్షన్స్ చూసుకుంటే రూ.1.24 కోట్ల వసూళ్లు దక్కాయి. ఇక మూడో రోజు రూ.1.36 కోట్ల కలెక్షన్లు దక్కడంతో..ఓపెనింగ్ డే కంటే మూడో రోజే ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు దక్కినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 

కథేంటంటే: 

అనాథలైన భద్ర (సత్యదేవ్‌), శివ (కృష్ణ బూరుగుల), కోటి (లక్ష్మణ్‌ మీసాల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ బయటకొచ్చాక ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్మగ్లింగ్‌ చేసి పొట్ట నింపుకొంటుంటారు. వీళ్లంతా తమకంటూ ఓ కుటుంబం ఉండాలని ఆశ పడతారు.

ఈ క్రమంలోనే మీనా (అతీరా రాజ్‌)తో శివ ప్రేమలో పడతాడు.ఆమె భద్రకు రాఖీ కట్టడంతో తనూ ఆమెను సొంత చెల్లిగా చూడటం మొదలు పెడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్‌ వంటి తప్పుడు పనులు మానేసి ఆటో నడుపుతూ సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తాడు భద్ర. అయితే ఓసారి మీనా తల్లి ఆపరేషన్‌కు రూ.2లక్షలు అవసరమైతే.. ఆ డబ్బు సంపాదించడం కోసం భద్ర, శివ, కోటి తప్పనిసరి పరిస్థితుల్లో గంజాయి స్మగ్లింగ్‌ చేయడానికి సిద్ధపడతారు. 

విజయవాడలో భద్ర, కోటీ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు.అయితే,ఓసారి పోలీసులకు పట్టుబడతారు. అలాగే.. ఓ పెద్ద తీవ్రమైన కేసులో ఇరుక్కుంటారు. దీంతో ఏకంగా వారికి 14ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. వారు ఇరుక్కున్న కేసు ఏంటి.. వారిని ఎవరు టార్గెట్ చేశారన్న అంశాలు కృష్ణమ్మ మూవీలో ప్రధానంగా ఉంటాయి.