బడ్జెట్ అప్‌‌డేట్స్: రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్

బడ్జెట్ అప్‌‌డేట్స్: రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్

న్యూఢిల్లీ: ఈ ఏడాది బడ్జెట్‌‌లో రోడ్లు, హైవేల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రహదారుల అభివృద్ధిలో భాగంగా భారతమాల పథకం కింద రోడ్లు, హైవేల కోసం రూ. 1.18 లక్షల కోట్లు కేటాయించింది. రోడ్ల నిర్మాణానికి గాను అస్సాంకు 3,400 కోట్లు, తమిళనాడుకు 1.03 లక్షల కోట్లు, కేరళకు రూ.65 వేల కోట్లు, బెంగళూరుకు రూ. 25 వేల కోట్లను ప్రకటించింది. తమిళనాడులో 3,500 కిలోమీటర్ల జాతీయ రహదారులను విస్తరించనుంది. అలాగే కొచ్చి, చెన్నై, బెంగళూరు, నాగ్‌‌పూర్‌‌ల్లో మెట్రో విస్తరణకు నిధులు కేటాయించింది. విజయవాడ-ఖరగ్‌‌పూర్ మధ్య ఈస్ట్‌కోస్ట్ సరుకు రవాణా కారిడార్‌‌కు కేంద్రం ఓకే చెప్పింది. 2022 జూన్ నాటికి తూర్పు-పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌‌ను కూడా నిర్మించనుంది.