క‌రోనా క‌ట్ట‌డికై 50 జిల్లాలకు సెంట్రల్​ టీమ్స్​

క‌రోనా క‌ట్ట‌డికై 50 జిల్లాలకు సెంట్రల్​ టీమ్స్​

తెలంగాణ సహా 15 రాష్ట్రాలకు పంపనున్న కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హైలెవెల్​ సెంట్రల్​ టీమ్స్​ను పంపిస్తోంది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ సహా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50కి పైగా జిల్లాల్లో ఆ టీమ్స్​ కరోనా పరిస్థితిని అంచనా వేస్తాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతేగాకుండా కంటెయిన్​మెంట్​ జోన్లలో స్థానిక అధికారులకు కరోనా నిర్వహణపై సాయం అందిస్తాయని చెప్పింది. రెండు నెలల పాటు టెస్టింగ్​లో లోపాలు, టెస్టుల సంఖ్య, కేసుల పరిస్థితి, ఆస్పత్రుల్లో పడకల కొరత, మరణాల రేటు, డబ్లింగ్​ రేటు వంటి విషయాలపై పనిచేస్తాయని పేర్కొంది.

తెలంగాణలోని 4 జిల్లాల్లో సెంట్రల్​ టీంలు పరిస్థితిని అంచనా వేయనున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడుల్లో 7 చొప్పున జిల్లాల్లో పర్యటించనున్నాయి. అస్సాంలో 6, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఒడిశాల్లో 5 చొప్పున, హర్యానా, కర్నాటక, బీహార్​, ఉత్తర్​ప్రదేశ్​లలో 4 చొప్పున, గుజరాత్​, ఉత్తరాఖండ్​, వెస్ట్​బెంగాల్​లో 3 చొప్పున జిల్లాల్లో సెంట్రల్​ టీంలు విజిట్​ చేస్తాయి. అన్ని జిల్లాల్లోని కంటెయిన్​మెంట్​ ఏరియాల్లో అధికారులకు సెంట్రల్​ టీంలు టెక్నికల్​ సాయాన్ని అందిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. వైరస్​ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరైన ట్రీట్​మెంట్​, క్లినికల్​ మేనేజ్​మెంట్​లో తోడ్పాటును అందిస్తాయని చెప్పింది. ఒక్కో టీంలో ముగ్గురు సభ్యులు ఉంటారని, అందులో ఇద్దరు పబ్లిక్​ హెల్త్​ ఎక్స్​పర్ట్​లు, ఒక సీనియర్​ జాయింట్​ సెక్రటరీ స్థాయి నోడల్​ ఆఫీసర్​ ఉంటారని పేర్కొంది.

Central teams deployed in over 50 districts, municipalities with high Covid-19 cases: Health minister