నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ‘వీడియో గేమ్ సెంట‌ర్’ నిర్వ‌హ‌ణ‌.. 19 మంది అరెస్ట్

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ‘వీడియో గేమ్ సెంట‌ర్’ నిర్వ‌హ‌ణ‌.. 19 మంది అరెస్ట్

హైదరాబాద్: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాయరా మార్కెట్ లో ఉన్న “డ్రీం వరల్డ్ వీడియో గేమ్” సెంటర్ పై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కొవిడ్‌-19 నిబంధనలకు విరుద్ధంగా ఈ వీడియో గేమ్ సెంట‌ర్ నిర్వ‌హిస్తున్నార‌న్న స‌మాచారంతో త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో గేమ్ సెంట‌ర్ యజమాని సయ్యద్ మొయినుద్దీన్ (38)తో పాటు మ‌రో 18 మంది ఆటగాళ్ళను అదుపులో తీసుకున్నారు. య‌జ‌మాని నుంచి రూ. 9555 న‌గ‌దుతో పాటు , 5 టీవీలు, 3 ప్లేయింగ్ స్టేషన్లు , 3 జాయ్ స్టిక్స్ / కంట్రోలర్, 6 మెమరీ కార్డులు, 13 సెల్ ఫోన్లు, ఒక భారత్‌పే క్యూఆర్ కోడ్ స్కానర్ ను స్వాధీనం చేసుకున్నారు. త‌దుప‌రి విచార‌ణ నిమిత్తం వారంద‌ర్నీ ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.

Central Zone Task Force police raid video game center in violation of Covid-19 regulations