Love Me Movie: లవ్‌ మీ స్టుపిడ్ హార్ట్ లిరికల్ రిలీజ్..ఆస్కార్ విన్నర్స్ కీరవాణి,చంద్రబోస్ న్యూ మెలోడీ

Love Me Movie: లవ్‌ మీ స్టుపిడ్ హార్ట్ లిరికల్ రిలీజ్..ఆస్కార్ విన్నర్స్ కీరవాణి,చంద్రబోస్ న్యూ మెలోడీ

యంగ్ హీరో ఆశిష్‌,బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌ మీ’. ఇఫ్‌ యు డేర్‌..అన్నది ఉపశీర్షిక.  ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు.రీసెంట్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అమేజింగ్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది.

తాజాగా లవ్ మీ నుంచి స్టుపిడ్ హార్ట్ అంటూ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాట అమ్మాయి హృదయం నుండి ప్రేమను వ్యక్తపరిచే మెలోడీగా సాగుతుంది. వద్దన్నా..వద్దో వద్దోన్న ఆగదు మరి..కొంచెం కొంచెం కూడా వినదే వినదే ఈ స్టుపిడ్ హార్ట్ అంటూ సాగే ఈ గీతాన్ని ఆస్కార్ విన్నర్ కీరవాణి కంపోజ్ చేయగా ..చంద్రబోస్ లిరిక్స్ అందించాడు.సాయి శ్రేయ పాడారు. 

ఈ మూవీ మే 25, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే, ఏప్రిల్ 25న   చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా లవ్ మీ రిలీజ్ పోస్ట్ఫోన్ అవ్వడంతో..ఇపుడు మంచి అవుట్ ఫుట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక హారర్ థ్రిల్లర్. ఓ కుర్రాడు  దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. 

ఆశిష్ రెడ్డి ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సోదరుడు శిరీష్ (Shirish) కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ మొదటి నటనతో మంచి మార్కులు తెచుకున్నాడు. సినిమా మాత్రం ఆశించినంత సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత వెంటనే సెల్ఫీష్ అనే సినిమాను మొదలుపెట్టాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా..గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మరి ఇపుడు త్వరలో రిలీజ్ కానున్న లవ్‌‌‌‌‌‌‌‌ మీ తో ఎలాంటి హిట్ అందుకోనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.