
అషు రెడ్డి.. సోషల్ మీడియా పీపుల్ కి ఈ అమ్మడు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. డబ్ స్మాష్ వీడియోలతో ఫేమ్ సంపాదించుకున్న అశు ఆ తరువాత యూట్యూబర్ గా మారింది. షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఆ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. ఇక రామ్ గోపాల వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇక అక్కడినుండి అశు రెడ్డి ఫేమ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే గ్లామర్ షో గురించి ఎంత చెప్పునా తక్కువే. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని చేసే హాట్ హాట్ ఫోటో షూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేయడం ఈ అమ్మడు స్పెషాలిటీ.
#AshuReddy as Ravishing Harika from the world of #Yevam ? pic.twitter.com/MhCWLRs2ih
— Vamsi Kaka (@vamsikaka) May 3, 2024
కొంతకాలం నుండి అడపాదడపా సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవ్ యేవమ్ మూవీ నుండిఅశు రెడ్డి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హారిక అనే పాత్రలో కనిపించనుంది అషు . ఆ పోస్టర్ లో చైర్‌లో కాలుమీద కాలు వేసుకొని చాలా గ్లామర్ గా కూర్చొని ఉంది అశు. ఆ పోస్టర్ కి.. నా బాడీ సూపర్ డీలక్స్.. అనే కాప్షన్ ను ఇచ్చారు. ఆ లుక్ చూస్తుంటూ అషు రెడ్డి ఈ మూవీలో బోల్డ్‌గా కనిపించనున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. మరి రిలీజ్ తరువాత కుర్రాళ్లను ఏ రేంజ్ ఆకట్టుకోనుందో ఈ బ్యూటీ.