
టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు ఎనిమిది రోజుల ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటే రిజర్వేషన్ ఫీజును మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ ప్రకటించారు.
"సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను మినహాయింపు ఇస్తోంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించండి" అని ఎక్స్ వేదికగా తెలిపారు.
యాత్రికుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, ప్రజా రవాణా సంస్థ హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, బస్సు సర్వీసులు, ఫ్రీక్వెన్సీని పెంచనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఫ్రీ బస్సు వినియోగం ఎక్కువగా పుణ్యక్షేత్రాల ఉన్న చోటకే వెళ్తున్న క్రమంలో టీఎస్ఆర్టీసీ ఈ మేరకు యోచిస్తున్నట్టు సమాచారం. ఈ బస్సులు MGBS, JBS, BHEL మరియు నగరంలోని ఇతర ప్రాంతాల నుండి ప్రారంభమవుతాయి, బస్సులు దాదాపు ప్రతి అరగంటకు ఒకటి ఉన్నట్టు సమాచారం.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను #TSRTC మినహాయింపు ఇస్తోంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం https://t.co/F0naRXIa8A వెబ్ సైట్ ని సంప్రదించండి.@TSRTCHQ… pic.twitter.com/RVJLegoj5A
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 3, 2024