
ప్రధాని మోదీపై విమర్శలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దేశంలో మోదీ AA ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఆర్ టాక్స్ అంటూ మోడీ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నల్లగొండ, భువనగిరి 2 లోక్ సభ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ కార్యక్రమంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శకం ముగుస్తుందని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో తీన్మార్ మల్లన్నను గెలిపించాలన్నారు. కేసీఆర్ అక్రమాలను నిజాయితీగా బయటపెట్టిన వ్యక్తి తీన్మార్ మల్లన్న చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ శకం ముగుస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ మాటలు వింటుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి, మానసిక స్థితి బాగాలేదేమో అనిపిస్తుందన్నారు.
గల్లీ నుండి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అన్నారు. బీఆర్‌ఎస్ కు ఓటేస్తే మూసిలో వేసినట్టే అని కామెంట్ చేశారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది… రాహుల్ ప్రధాని అవుతున్నారని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.