ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్స్ వద్దు.. బ్యాంక్ నుంచి నేరుగా చలాన్ల డబ్బు కట్ చేయండి : సీఎం రేవంత్

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్స్ వద్దు.. బ్యాంక్ నుంచి నేరుగా చలాన్ల డబ్బు కట్ చేయండి : సీఎం రేవంత్

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రూల్స్​ మరింత కఠినతరం చేయాలని సీఎం రేవంత్​రెడ్డి పోలీస్​శాఖను ఆదేశించారు. ట్రాఫిక్​ రూల్స్ పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. చలాన్లు వేయడం.. మళ్లీ డిస్కౌంట్ ఇవ్వడం కాదు.. చలాన్లపై డిస్కౌంట్లు వద్దు.. నేరుగా బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కట్​ అయ్యేలా  బ్యాంకులను సింక్రనైజ్​ చేసుకోవాలన్నారు. 

ట్రాఫిక్​ డిపార్టుమెంటులో ఉద్యోగం అంటే డిమోషన్​లా కొందరు ఫీలవుతున్నారు.. ట్రాఫిక్​ డిపార్టుమెంటును మరింత బలోపేతం చేస్తామన్నారు సీఎం రేవంత్​రెడ్డి. డీజీ, అడిషనల్​ డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణతో వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. 

రోడ్డు ప్రమాదాలపై  ఆందోళన వ్యక్తం చేశారు.  దేశంలో ప్రతి నిమిషం  రోడ్డు ప్రమాదం జరుగుతోంది.. ప్రతి మూడు నిమిషాలకు ఓ ప్రాణం పోతుంది. రోడ్డు సేఫ్టీ పై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మైనర్లు వెహికల్స్​ తో రోడ్డు  ఎక్కడం వల్లే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మైనర్లకు బండ్లు ఇవ్వకుండా పూర్తి బాధ్యత పేరెంట్స్​ తీసుకోవాలి. తాగి బండి నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. చలాన్లకు ముందే నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పోలీస్​ శాఖను ఆదేశించారు  సీఎం. 

►ALSO READ | ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక

చెరువుల కబ్జాపై మాట్లాడిన సీఎంరేవంత్​ రెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన చెరువులను కాపాడుతున్నామన్నారు. చెరువుల విస్తీర్ణం తగ్గిపోవడంతో.. చిన్న వర్షాలకే సమీప నివాసాలు ముంపునకు గురవుతున్నాయి.. కబ్జాకు గురైన చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యంత్రాంగం హైడ్రా ను తీసుకొచ్చామన్నారు. 

 సైబర్ క్రైం పై మాట్లాడిన సీఎం.. ఇప్పుడు సైబర్ క్రైం అనేది అతిపెద్ద నేరంగా మారిందన్నారు. తేరుకునేలోపే  బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయన్నారు. సైబర్ క్రైం ను  అరికట్టేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. 
రాష్ట్రంలో  డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు సీఎం. సమాజానికి  డ్రగ్స్ అతిపెద్ద శత్రువన్నారు. డ్రగ్స్ రాష్ట్ర సమస్యే కాదు.. దేశ సమస్య అని .. గ్రడ్స్డ్రగ్స్, గంజాయిని నియంత్రించేందుకు ఈగల్ ఫోర్స్ ను  తీసుకొచ్చామన్నారు.