హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి పండుగకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 30.03 శాతం నుంచి 33.67 శాతానికి డీఏ సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
2023 జూలై 1 నుంచి పెంచిన డీఏ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఉద్యోగులకు, యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు డీఏ చెలించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకూ బకాయిలు ఉన్నాయి.
* ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
* డీఏ 30.03% నుంచి 33.67%కి పెంపు
* 1 జూలై 2023 నుంచే అమలు
* రాష్ట్ర ఉద్యోగులకు డీఏ 73.344%కి పెరిగింది
* ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులకు ₹6,700 డీఏ
* బకాయిలు జీపీఎఫ్ / PRAN ఖాతాల్లో జమ
* ఫిబ్రవరి 1, 2026న జీతంతో డీఏ చెల్లింపు
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
