Nikhil : బాక్సాఫీస్ రికార్డులపై గురిపెట్టిన 'స్వయంభు'.. ఇంటర్వెల్ సీన్‌తో థియేటర్లలో పూనకాలే!

Nikhil : బాక్సాఫీస్ రికార్డులపై గురిపెట్టిన 'స్వయంభు'.. ఇంటర్వెల్ సీన్‌తో థియేటర్లలో పూనకాలే!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ'స్వయంభు". ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీసన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మి స్తున్న ఈ చిత్రానికి ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 

ఈ చిత్రం ఫిబ్రవరి 13. 2026న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. పూర్తి పీరియాడికల్ మైథ లాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంటర్వల్ సీక్వెన్స్ హైలైట్ కాబోతోందట. ఈ సీన్లో నిఖిల్ ఇతర ప్రధాన పాత్రల మధ్య వచ్చే యాక్షన్ విజువ ల్స్ చాలా వైల్డ్ గా ఉంటాయని సమాచారం. 

►ALSO READ | Rajamouli: థియేటర్లలో ఆడియన్స్ వణికిపోవాల్సిందే.. రామ్ చరణ్'RC17' ఓపెనింగ్ సీన్‌ను రివీల్ చేసిన రాజమౌళి !

ముఖ్యంగా నిఖిల్ గెటప్, యుద్ధ సన్నివేశాల సెటప్ ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తాయని  టాక్ వినిపిస్తోంది. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సీన్స్ ను  మరో లెవల్ కు తీసుకెళ్లనున్నాయని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ హైపు క్రియేట్ చేశాయి. ఈ లేటెస్ట్ యాక్షన్ అప్డేట్ నిఖిల్. అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. మరి బాక్సీఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.