హైదరాబాద్ ఘట్కేసర్ సర్కిల్ లో బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం (జనవరి 12) సాయంత్రం భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఫైళ్లు, ఫర్నిచర్ కాలిపోయింది. పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ కెనరా బ్యాంకులో చెలరేగిన మంటలకు స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
సాయంత్రం 8.30 గంటల తర్వాత బ్యాంక్ లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కెనరా బ్యాంకులో మంటలు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో బ్యాంకు వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో పలు ఫైల్లు బూడిదయ్యాయి. ఫర్నిచర్ కూడా ధ్వంసమయ్యింది. బ్యాంకు నుంచి పొగలు బయటికి వస్తుండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. మంటలు అంతకంతకూ పెరుగుతుండటంతో భారీ ఎత్తున స్థానికులు చేరుకున్నారు. చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది.
►ALSO READ | జీహెచ్ఎంసీ పరిధిలో.. మెగా ఈ–శానిటేషన్ డ్రైవ్.. 47మెట్రిక్ టన్నుల ఈ–వేస్ట్ సేకరణ
