హైదరాబాద్: ఈ వేస్ట్ సేకరణలో భాగంగా జీహెచ్ ఎంసీ పరిధిలో మెగా ఈవేస్ట్ డ్రైవ్ ను నిర్వహించారు అధికారులు. సోమవారం ( జనవరి 12) ఒక్కరోజే 47 మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలను సేకరించారు. నగరంలోని 271 లోకేషన్లలో మెగా ఈ వేస్ట్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టిన అధికారులు.. పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, బ్యాటరీలు, చార్జర్లు, వైర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించారు. ఈ వ్యర్థాలను 94 ప్రత్యేక వాహనాల్లో ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించారు. మంగళవారం కూడా మెగా ఈ–శానిటేషన్ డ్రైవ్ ను చేపట్టనున్నారు.
ఈ–వ్యర్థాల సేకరణకు జీహెచ్ ఎంసీ పరిధిలో ప్రతి సర్కిల్, డివిజన్ లో ప్రజల దగ్గర నుంచి ఈ–వేస్ట్ ను సేకరించి ప్రత్యేక వాహనాల ద్వారాప్రాసెసింగ్ యూనిట్లకు తరలించారు. మెయిన్ సర్కిళ్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూఇటీల్లో గ్రూప్ కలెక్షన్ సిస్టమ్ ద్వారా ఈ–వేస్ట్ ను సేకరిస్తున్నారు. సేకరించిన ఈ–వేస్ట్ ను ప్రభుత్వం అనుమతి పొందిన రీసైక్లింగ్ ఏజెన్సీలకు తరలించారు.
మరో వైపు ఈ–వేస్ట్ ను సాధారణ చెత్తతో కలపొద్దని ప్రజలకు జీహెచ్ ఎంసీ అధికారులు సూచించారు. ఈ–వేస్ట్ తో పర్యావరణ కాలుష్యం, భూగర్బజల కాలుష్యం జరిగి ఆనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.ఈ–డ్రైవ్ ద్వారా సురక్షిత రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
►ALSO READ | కోరుట్లలో విషాదం.. భార్య ప్రాణం మీదకు తెచ్చిన భర్త అప్పులు !
ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలకు శానిటేషన్ సిబ్బంది, ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్స్ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహించునున్నారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ–వేస్ట్ ను అప్పగించాలని జీహెచ్ ఎంసీ సూచించింది. భవిష్యత్‌లో కూడా నిరంతర ఈ-వేస్ట్ కలెక్షన్ విధానం అమలు చేసే యోచన లో ఉన్నారు. ఈ-వేస్ట్ సరైన విధంగా నిర్వహిస్తే నగరం మరింత స్వచ్ఛంగా, సురక్షితంగా మారుతుందంటున్నారు జీహెచ్ ఎంసీ అధికారులు.
