కోరుట్లలో విషాదం.. భార్య ప్రాణం మీదకు తెచ్చిన భర్త అప్పులు !

కోరుట్లలో విషాదం.. భార్య ప్రాణం మీదకు తెచ్చిన భర్త అప్పులు !

జగిత్యాల జిల్లా: భర్త చేసిన అప్పులు, ఆర్థిక సమస్యలతో కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్లో రమ్య సుధా (34) అనే మహిళా టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. వరంగల్ జిల్లాలోని రాయపర్తిలో జ్యోతిరావు పూలే గురుకులంలో రమ్య సుధ టీచర్గా పనిచేస్తుంది. గురుకులానికి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో రెండు రోజుల క్రితం రాయపర్తి నుంచి కోరుట్లలోని తన ఇంటికి సుధ వచ్చింది. సుధ భర్త శ్రీధర్, పిల్లలు బట్టల వ్యాపారం చేస్తూ కోరుట్లలో నివాసం ఉంటున్నారు.

రమ్య సుధ భర్త శ్రీధర్ ఆమె పేరు మీద అప్పులు చేసి, నువ్వే ఈ అప్పులన్నీ తీర్చాలని రమ్య సుధపై ఒత్తిడి తేవడంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందింది. ఆర్థిక సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురైన తమ కూతురు ఉరి వేసుకుని చనిపోయిందని రమ్య సుధ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

►ALSO READ | తెలంగాణ జైళ్లలో 23వేల మంది ఖైదీలు చదువుకున్నారు..28మందికి డిగ్రీ పట్టా..డీజీ సౌమ్య మిశ్రా