2025లో తెలంగాణ జైళ్లలో 23 వేల మంది ఖైదీలు చదువుకున్నారని, డిగ్రీలు పొందారని జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా చెప్పారు. థంబ్ ఇన్–సైన్ అవుట్కార్యక్రమం ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 28 మంది ఖైదీలు తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని చెప్పారు సౌమ్య మిశ్రా.
2025లో తెలంగాణ జైళ్లలో పురుషులు, మహిళలు కలిపి మొత్తం 42వేల 566మంది ఖైదీలున్నారని చెప్పారు సౌమ్య మిశ్రా.హత్య కేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. 1,045 మంది ఖైదీలకు ఉచిత న్యాయ సలహా సేవలు అందించినట్లు చెప్పారు. పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) కేసుల్లో 5,999 మంది పురుషులు, 312 మంది మహిళలు జైళ్లలో ఉన్నారని వివరించారు.
►ALSO READ | పోలవరం - నల్లమల సాగర్ తక్షణమే నిలిపివేయాలి: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
అండర్ థంబ్ ఇన్ - సైన్ అవుట్ నినాదం ద్వారా 23వేల220 మంది ఖైదీలను అక్షరాస్యులుగా మార్చారు. ఈ కార్యక్రమం కింద 8 మంది మహిళా ఖైదీలతో సహా 108 మంది ఖైదీలను పదవ తరగతి పరీక్ష రాసేందుకు NIOS (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్)లో చేర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న చెర్లపల్లి జైలు అధ్యయన కేంద్రాల ద్వారా 2025లో 28 మంది ఖైదీలు తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని సౌమ్య మిశ్రా ఓ ప్రకటనలో తెలిపింది.
