పోలవరం - నల్లమల సాగర్ తక్షణమే నిలిపివేయాలి: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి

పోలవరం - నల్లమల సాగర్ తక్షణమే నిలిపివేయాలి: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి

ఢిల్లీ: ఎలాంటి అనుమతులు లేని పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వరద జలాల పేరుతో అదనపు నీటిని తరలించే హక్కు ఏపీకి లేదని అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేప డుతున్న ప్రాజెక్టులపై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాల వినియోగంలో తీవ్రమైన ఉల్లంఘన లకు పాల్పడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 

గోదావరి బేసిన్ లో ఏపీకి కేవలం 484 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ఉన్నాయని, అంతకు మించి ఒక్క చుక్క నీటిని అదనంగా వాడుకున్నా అది అంతర్రాష్ట్ర ఒప్పందాలను, ట్రిబ్యునల్కేటాయింపులను ధిక్కరించడమే అవుతుం దని హెచ్చరించారు. వరద జలాల పేరుతో అదనపు నీటిని తరలించే హక్కు ఏపీకి లేదని ఆయన స్పష్టం చేశారు. 

►ALSO READ | ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్స్ వద్దు.. బ్యాంక్ నుంచి నేరుగా చలాన్ల డబ్బు కట్ చేయండి : సీఎం రేవంత్

ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక నిబంధనలను ఏపీ సర్కార్ తుంగలో తొక్కిందని, కేంద్రం ఇచ్చిన 'స్టాప్ వర్క్' ఆర్డర్లను సైతం అమలు చేయకుండా మొండిగా పనులు కొనసాగిస్తోందని మండిపడ్డారు.