హైదరాబాద్: సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి కాకినాడకు, కాకినాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్ నంబర్.. 07480 రైలు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి జనవరి 19న ఉదయం 10 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఈ ట్రైన్.. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
South Central Railway is running additional Sankranti Special Trains connecting Charlapalli with Kakinada Town and Tirupati.#SankrantiSpecialTrains #SankrantiTravel #FestiveRush #SpecialTrains#SouthCentralRailway pic.twitter.com/JT37ETzHC9
— South Central Railway (@SCRailwayIndia) January 12, 2026
ట్రైన్ నెంబర్.. 07481 రైలు కాకినాడ టౌన్ నుంచి చర్లపల్లికి వస్తుంది. జనవరి 19న సోమవారం రాత్రి 11.15 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం అంటే జనవరి 20న ఉదయం 11.45 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
►ALSO READ | ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్స్ వద్దు.. బ్యాంక్ నుంచి నేరుగా చలాన్ల డబ్బు కట్ చేయండి : సీఎం రేవంత్
గుంటూరు, విజయవాడ రూట్లో రద్దీ కారణంగా బస్సులు, ట్రైన్లలో ఖాళీ దొరక్క ఇబ్బందిపడుతున్న ప్రయాణికులకు ఈ ట్రైన్ ఉపయోగపడుతుంది. కాకినాడ వయా రూట్ల నుంచి వచ్చే ప్రయాణికులకు, గుంటూరు, విజయవాడ నుంచి జనవరి 19న హైదరాబాద్ రావాలనుకునే ప్రయాణికులకు ఈ స్పెషల్ ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.
