శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది.గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో బాదల్ చేతికి గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు. చేతికి గాయంతో ఆస్పత్రికి వెళ్తున్న బాదల్ కు సంబందించిన దృశ్యాలు స్థానిక వీడియోలలో కనిపించాయి. గురుద్వారా లోపల కత్తితో (సిక్కుల పవిత్ర చిహ్నం నిహంగ్ ) బాదల్ పై దాడి జరిగినట్లు నాందేడ్ పోలీసులు తెలిపారు.
గురువారం ఉదయం శిరోమణి అకాలీ దళ్ ఎంపీ అయిన బాదల్ భార్య హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తో కలిసి నాందేడ్ లోని తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించిన సమయంలో ఈ దాడి జరిగింది.
