యూరిన్ బాటిళ్లు, బట్టలు, చెప్పులు.. కన్వర్ యాత్ర తర్వాత చెత్తకుప్పలా మారిన హరిద్వార్

యూరిన్ బాటిళ్లు, బట్టలు, చెప్పులు.. కన్వర్ యాత్ర తర్వాత చెత్తకుప్పలా మారిన హరిద్వార్

పవిత్రమైన హరిద్వార్.. చెత్తకుప్పలా మారిపోయింది. హరహర మహాదేవ్.. భంభమ్ భోలే.. అంటూ భక్తి శ్రద్ధలతో యాత్రకు వెళ్లిన భక్తులు.. హరిద్వార్ పరిసరాలను గ్యార్బేజీలా మార్చేశారు. కన్వర్ యాత్ర సందర్భంగా వచ్చిన దాదాపు ఐదు కోట్ల యాత్రికులు.. టన్నుల కొద్ది చెత్తను వదిలి వెల్లటం.. ఇప్పుడు మున్సిపల్ శాఖకు తలనొప్పిగా మారింది. 

కన్వర్ యాత్ర యాత్ర సందర్భంగా.. భక్తులు గంగా నది తీర ప్రాంతాలను అపరిశుద్ధంగా మార్చిన వీడియోలు ఇపుడు వైరల్ గా మారుతున్నాయి. దాదాపు 7 వేల మెట్రిక్ టన్నుల చెత్త పారవేసి వెళ్లారట. అందులో బట్టలు, చెప్పులు, యూరిన్ బాటిల్స్ ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. 

దీనిపై నెటిజన్ చేసిన కామెంట్ చర్చకు దారితీసింది. కన్వర్ యాత్ర ముగిసింది. మిలయన్ల  కొద్దీ  శివ భక్తులు, కన్వరియాలు.. 7000 మెట్రిక్ టన్నుల చెత్త, లోదుస్తులు, మూత్రంతో నింపిన బాటిల్స్ గంగా నది తీరంలో పడవేసి.. మోక్షం పొందారు.. అంటూ ట్వీట్ చేశారు. 

ప్రపంచంలోనే ప్రిసిద్ది గాంచిన.. హరిద్దవార్ వందల ఘాట్లు ఇప్పుడు చెత్తతో నిండిపోయాయి.చివరికి మహిళలు బట్టలు మార్చుకునే గదుల్లో కూడా మూత్రంతో నిండిన బాటిల్లు, గుట్టలకొద్దీ గ్యార్బేజ్ ఉండిపోయిందని ట్వీట్ చేశారు. 


క్లీనింగ్ క్యాంపెయిన్:

టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్తను ఎత్తివేసేందుకు  ఆగస్టు 12 నుంచి 18 వరకు మున్సిపల్ సిబ్బందికి కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో భారీ క్లీనింగ్ క్యాంపెయిన్ జరపాల్సిందిగా మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. 

అందుకోసం తత్కాలికంగా వెయ్యి మంది శానిటీ వర్కర్లను నియమించినట్లు చె్పారు. దాదాపు 80కి పైగావాహనాలను రంగంలోకి దించారు. శానిటేషన్ ఇష్యూను గుర్తించేందుకు డ్రోన్ కెమెరా ద్వారా రిపోర్టు తీసుకుంటామని అధికారులు తెలిపారు.