అద్దె ఇల్లు చూడటానికి పోతే గేటు తీయగానే బయటికొచ్చిన కుక్క ఎంత పని చేసిందంటే..

అద్దె ఇల్లు చూడటానికి పోతే గేటు తీయగానే బయటికొచ్చిన కుక్క ఎంత పని చేసిందంటే..

పాటియాలా: కుక్కలను పెంచుకోవడం తప్పు కాదు. కానీ.. అవి ఇతరులకు హాని చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. పంజాబ్లోని పాటియాలాలో ఘోరం జరిగింది. అద్దె ఇంటిని చూడటానికి రియల్ ఎస్టేట్ డీలర్‌తో కలిసి వెళ్లిన భార్యాభర్తలపై ఆ ఇంట్లో ఉన్న కుక్క అమానుషంగా దాడి చేసింది. ఇల్లు చూడటానికి గేటు తీసిన వెంటనే బయటికొచ్చిన కుక్క భార్యాభర్తలను ఇంట్లోకి అడుగు కూడా పెట్టక ముందే ఎగబడి కరిచింది.

పిట్‌ బుల్ జాతికి చెందిన ఈ కుక్క దాడిలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ కాపాడేందుకు స్థానికులు ఎంతో ప్రయత్నించారు. కానీ.. ఆ కుక్క ఎంత కొట్టినా భార్యాభర్తలను వదిలిపెట్టలేదు. మీద పడి కరుస్తూనే ఉంది. ఒక గుంపు మొత్తం వచ్చి ఆ కుక్కను కర్రలతో కొట్టాకే అక్కడి నుంచి కుక్క వెళ్లిపోయింది. కానీ.. ఈలోపే పాపం ఆ భార్యాభర్త విపరీతంగా గాయపడ్డారు.

మహిళ ఒంటిపై నుంచి రక్తం కారుతూనే ఉంది. చికిత్స నిమిత్తం భార్యాభర్తలను పాటియాలాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితులు అంకిత్ ససభరర్వాల, షిఫాలీ సభర్వాల్ మంగళవారం సాయంత్రం అద్దె ఇల్లు చూడటానికి వెళ్లిస నమయంలో ఈ ఘటన జరిగింది.

ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న అంకిత్ సభర్వాల్, చండీగఢ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అతని భార్య షిఫాలీ సభర్వాల్ అద్దె ఇల్లు చూడటం కోసం ప్రాపర్టీ డీలర్తో కలిసి ఇల్లు చూడటానికి ఘుమన్ నగర్‌కు వెళ్లారు. షిఫాలీ కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన భార్యను కాపాడే ప్రయత్నంలో అంకిత్ కాళ్లు, వీపుపై కూడా తీవ్రమైన కాటు గాయాలయ్యాయి.