రైడ్ త్వరగా కన్ఫర్మ్ కావాలంటే ఎక్స్ ట్రా పే చేస్తున్నారా..? ర్యాపిడో, ఓలా, ఉబెర్ యాప్స్కు కేంద్రం షాక్

రైడ్ త్వరగా కన్ఫర్మ్ కావాలంటే ఎక్స్ ట్రా పే చేస్తున్నారా..? ర్యాపిడో, ఓలా, ఉబెర్ యాప్స్కు కేంద్రం షాక్

ర్యాపిడో, ఓలా, ఉబెర్ బైక్, ఆటో, క్యాబ్ బుక్ చేసినప్పుడు బాగా వెయిటింగ్ వస్తుందా..? ఆ టైమ్ లో రైడ్ త్వరగా కన్ఫర్మ్ అవ్వాలంటే ఎక్స్ ట్రా పే చేయమని యాప్ సజెస్ట్ చేస్తుందా. రూ.10,20,50.. అంటూ కొంత టిప్ పే చేస్తే రైడ్ బుక్ అయ్యే ఛాన్సెన్స్ ఎక్కవ అంటే.. కట్టేస్తున్నారా..? ఈ బాదుడుకు అడ్డుకట్ట వేసింది కేంద్రం. టిప్ రూపంలో కస్టమర్స్ నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం కుదరదని రైడ్ బేస్డ్ యాప్స్ కు తేల్చిచెప్పింది. 

రైట్-బేస్డ్ ప్లాట్ ఫామ్స్ కు.. ప్యాసెంజర్స్ నుంచి రైడ్ కు ముందు లేదా రైడ్ సందర్భంగా టిప్ వసూలు చేయడం ఆపేయాలని 2026 ఆగస్టు 13న ఆదేశాలు జారీ చేసింది. టిప్ ఇవ్వడం అనేది కస్టమర్ ఆప్షన్ అని.. అది కూడా జర్నీ పూర్తయిన తర్వాత ఇవ్వాలనుకుంటే ఇస్తాడు లేదంటే లేదు అని స్పష్టం చేసింది ప్రభుత్వం. 

రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు రైడ్ అగ్రిగేటర్స్ కు ఆదేశాలు జారీ చేసింది. రైడ్ కు ముందే టిప్ వసూలు చేసే ప్రాంప్ట్ ను ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాల్సిందిగా ఆదేశించింది. 

అడ్వాన్స్డ్ టిప్ (Advance Tip), చూస్ యాడ్ ఆన్ (Choose an Add-on) అనే ప్రాంప్ట్ తో పాటు.. ఎక్కువ చెల్లిస్తే రైడ్ తొందరగా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుందని కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్న అగ్రిగేటర్లు.. నిబంధనలను అతిక్రమించడమేనని పేర్కొంది. టిప్ ఆప్షన్ అనేది రైడ్ తర్వాత మాత్రమే చూపించేలా మార్పులు చేయాలని సూచించింది. 

ఎందుకు ఈ నిర్ణయం:

ఎక్కువ చెల్లిస్తే త్వరగా రైడ్ కన్ఫర్మ్ అవుతుందని.. డ్రైవర్ యాక్సెప్ట్ చేస్తాడని, వెయిటింగ్ టైమ్ తగ్గుతుందనే ఇంప్రెషన్ క్రియేట్ చేసేలా ప్లాట్ ఫామ్స్ ఈ టిప్ ఆప్షన్ ఉందని కేంద్రం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ని ఇద అతిక్రమించడమేనని చెప్పింది. అందులో భాగంగా ఈ ఆప్షన్ పై చర్యలు తీసుకుంది కేంద్రం.