రూ. 250 కోట్ల ప్రజాధనం వృధా చేశారు... అమిత్ షా క్షమాపణ చెప్పాలి: ఎంపీ వంశీకృష్ణ 

రూ. 250 కోట్ల ప్రజాధనం వృధా చేశారు... అమిత్ షా  క్షమాపణ చెప్పాలి: ఎంపీ వంశీకృష్ణ 

అమిత్ షా లోక్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గురువారం ( ఆగస్టు 13 ) పార్లమెంట్ నుంచి మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు వంశీకృష్ణ. 20 రోజు పార్లమెంట్ సమావేశాలకు రూ. 250 కోట్లు ఖర్చయ్యిందని...అమిత్ షా సభకు హాజరు కాకుండా ప్రజాధనం వృధా చేశారని అన్నారు ఎంపీ వంశీకృష్ణ.

జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై లాఠీఛార్జ్, ఏకే 47 లతో దాడి చేసి తప్పు చేశారని... అమిత్ షా సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వంశీకృష్ణ. సభకు రాకుండా రూ.250 కోట్ల ప్రజాధనం వృధా చేసినందుకు అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ వంశీకృష్ణ.

ఇదిలా ఉండగా... గురువారం లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. వందేమాతరం గీతాలాపన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు స్పీకర్. చివరి రోజు సభకు హాజరయ్యారు ప్రధాని మోడీ, అమిత్ షా. 19 రోజుల పాటు ఎలాంటి చర్చలు లేకుండానే సాగాయి పార్లమెంట్ సమావేశాలు.