వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని..కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, బయటకు వెళ్లోద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని సూచించింది.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో..
అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతవరణ శాఖ. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలోని ఈ ప్రాంతాల్లో...
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని... ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తోందని తెలిపింది వాతావరణ కేంద్రం. ఈ ప్రభావంతో ఆగస్టు 18వ తేదీ వరకు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
