అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేసింది: 5G ఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. మిస్ అయితే అంతే!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేసింది: 5G ఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. మిస్ అయితే అంతే!

ఇండిపెండెన్స్ డే సందర్భంగా  అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్, ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ మొదలయ్యాయి. దింతో శాంసంగ్, వన్‌ప్లస్, మోటరోలా, ఐక్యూ (iQOO), రెడ్‌మి వంటి టాప్ బ్రాండ్ల 5G స్మార్ట్‌ఫోన్‌లపై ఎన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్స్  లభిస్తున్నాయి. ఈ ఆఫర్లు ఆగస్టు 15తో ముగుస్తాయి. అయితే తక్కువ ధరలో మంచి 5G ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఈ సేల్‌లో ఉన్న బెస్ట్ ఆఫర్స్ ఏంటంటే :

1. శాంసంగ్ 
బ్రాండెడ్ & ఎక్కువ కాలం వాడేందుకు మంచి ఫోన్ కావాలంటే శాంసంగ్ మంచి ఛాయిస్.  ఈ సేల్ లో శాంసంగ్  గెలాక్సీ M36 5G సుమారు రూ. 19,999 ధరకే లభిస్తోంది. అయితే గెలాక్సీ A56 5G లాంచ్ ధర సుమారు రూ. 31,999 ధరలో ఉంది. మంచి కెమెరా, ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్. అంతేకాదు, దీంట్లో లాంగ్-టర్మ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా వస్తాయి.

2. వన్‌ప్లస్ 
స్పీడ్ &  గేమింగ్ ఇష్టపడేవాళ్ల కోసం వన్‌ప్లస్ ఫోన్ల పై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈసారి వన్‌ప్లస్ 13ఎస్ సుమారు రూ. 51,999 ధరకే దొరుకుతుంది. తక్కువ ధరలోనే హై-ఎండ్ ఫీచర్లు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫోన్. ఇంకా వన్‌ప్లస్  నార్డ్ (Nord) సిరీస్‌లో కూడా  మంచి ఆఫర్లు ఉన్నాయి.

3. మోటరోలా 
క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, పెద్ద స్క్రీన్ కోరుకునేవారికి మోటరోలా బెస్ట్. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర సుమారు రూ. 27,720 నుండి స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్, మంచి డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు.

4. ఐక్యూఓఓ (iQOO)
బడ్జెట్‌లో పవర్ ఫుల్ ఫీచర్లు కోరుకునే యూత్ కోసం iQOO ఫోన్లు బెస్ట్ అప్షన్. iQOO Z11 లైట్ తక్కువ బడ్జెట్‌లో ఫాస్ట్ 5G కనెక్టివిటీ కావాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్.

5. రెడ్‌మి 
తక్కువ ధరలో 5G ఫోన్‌కి  మారాలి అనుకునేవారికి రెడ్‌మి బెస్ట్ ఛాయిస్. రెడ్‌మి A7 ప్రో 5G ధర  సుమారు రూ. 14,449 నుండి ప్రారంభమవుతుంది. పాత 4G ఫోన్ మార్చుకుని.. తక్కువ ధరలో 5Gలోకి మారాలనుకునేవారికి ఇదొక  మంచి అవకాశం.

ఫోన్ ధర ఇంకా తగ్గాలంటే :
కేవలం ఇండిపెండెన్స్ డే  సేల్ డిస్కౌంటే కాకుండా, ఇతర పద్ధతులో కూడా ఇంకా తక్కువ ధరకే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎలా అంటే...

బ్యాంక్ ఆఫర్లు: HDFC, SBI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు పై ఫోన్ కొంటె ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే  కూడా ఇంకా ఎక్కువ తగ్గింపు లభిస్తుంది.

మెంబర్‌షిప్ బెనిఫిట్స్: అమెజాన్ ప్రైమ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారు ఎక్స్ట్రా డిస్కౌంట్లు ఏవైనా ఉన్నాయో చెక్ చేసి కొనండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్స్ ఆగస్టు 15తో ముగుస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా తీసుకోవడం మంచిది. అయితే కొన్ని హాట్ డీల్స్ లిమిటెడ్ కాలం పాటు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే  ఉండవచ్చు.