కార్పొరేట్ ఒత్తిళ్లకు తలవంచుతున్నారా?.. ఇదే లాస్ట్ చాన్స్..ఫుడ్ లేబుల్స్‌పై కేంద్రానికి, FSSAIకి సుప్రీం  వార్నింగ్..

కార్పొరేట్ ఒత్తిళ్లకు తలవంచుతున్నారా?.. ఇదే లాస్ట్ చాన్స్..ఫుడ్ లేబుల్స్‌పై కేంద్రానికి, FSSAIకి సుప్రీం  వార్నింగ్..

పాకెట్లలో లభించే చిరుతిళ్లు, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ పై మోతాదుకు మించి ఉండే చక్కెర, ఉప్పు,కొవ్వు పదార్థాలపై స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్‌ను (Front-of-Pack Warning Labels) ఏర్పాటు చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేంద్రానికి కోర్టు ఇస్తున్న ఆఖరి అవకాశమని స్పష్టం చేసింది.

జస్టిస్ జె.బి. పార్దివాలా. జస్టిస్ కె.వి. విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా కోర్టు మాట్లాడుతూ.."దేశ ప్రజలు, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా? అంటూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తీరును తప్పుబట్టింది. కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్నారని ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది. అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేస్తే భారత్‌లో సాంప్రదాయ ఆహార పదార్థాలపై కూడా రెడ్ మార్క్ పెట్టాల్సి వస్తుందని కేంద్రం తరఫు న్యాయవాది వాదించగా.. ప్రజల ప్రాణాల కంటే వ్యాపార లాభాలే ముఖ్యమా అని సుప్రీంకోర్టు మండిపడింది. 

ALSO READ : అద్దె ఇల్లు చూడటానికి పోతే గేటు తీయగానే బయటికొచ్చిన కుక్క ఎంత పని చేసిందంటే..

ప్రజలు తాము కొనుగోలు చేసే ఆహారంలో ఏయే పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునే హక్కు వారికి ఉందని కోర్టు గుర్తుచేసింది. తక్షణమే ఈ హెచ్చరిక లేబుల్స్ విధానాన్ని అమలు చేయాలని, లేనిపక్షంలో కోర్తే స్వయంగా తగిన ఆదేశాలు జారీ చేస్తుందని స్పష్టం చేస్తూ తదుపరి నిర్ణయం తెలపడానికి కేంద్రానికి గడువునిచ్చింది.