పాస్ పోర్టు ఉంటే చాలు.. ఆ వీసా లేకున్నా ఉచిత రవాణా సౌకర్యం.. భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్

పాస్ పోర్టు ఉంటే చాలు.. ఆ వీసా లేకున్నా ఉచిత రవాణా సౌకర్యం.. భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్

జర్మనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జర్మనీ ఛాన్స్లర్ ఇండియా పర్యటనలో భాగంగా సోమవారం (జనవరి 12) ఇండియా-జర్మనీ సంయుక్త ప్రకటన చేశాయి. 12,13 తేదీలలో ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అధికారిక పర్యటనలో సందర్భంగా ఈ ప్రకటన చేశారు. 

ఇండియన్స్ కు వీసా లేకుండానే రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఇండియా వీసాతో జర్మనీ మీదుగా ఉచితంగా ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జర్మనీ మీదుగా ఇతర దేశాలకు వెళ్లాలంటే ట్రాన్సిట్ వీసా ఉండాల్సిందే. ఇకనుంచి ఇండియన్స్ కు ఉచితంగా ఆ సౌకర్యంగా కల్పించనున్నట్లు ప్రకటించారు. 

►ALSO READ | స్టార్లింక్ ఉపగ్రహాలను జామ్ చేసిన ఇరాన్.. మిలిటరీ గ్రేడ్ టెక్నాలజీ ఖమేనీకి ఎక్కడిది?

ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ ఛాన్స్ లర్ మెర్జ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం భారతీయులకు రవాణా సౌకర్యం మాత్రమే కాదని.. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపర్చడం కోసమేనని ప్రకటనలో పేర్కొన్నారు.  రెండు దేశాల సంబంధాలను మరింత బలపర్చేందుకు ఇది తోడ్పడుతుందని మోదీ అన్నారు. 

విద్యార్థులు, పరిశోధకులు, వివిధ వృత్తి నిపుణులు, టూరిస్టులు, ఆర్టిస్టులు ఎంతోమంది జర్మనీకి సేవ చేశారని.. ఈ రంగాలలో మరింత ముందుకెళ్లేందుకు ఇరు దేశాలు తీసుకున్న నిర్ణయంగా ప్రకటనలో పేర్కొన్నారు. జర్మనీలో ఇండియన్స్ స్టూడెంట్స్ కు విద్య, ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మరిని అవకాశాలు కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామనం అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు.