స్టార్లింక్ ఉపగ్రహాలను జామ్ చేసిన ఇరాన్.. మిలిటరీ గ్రేడ్ టెక్నాలజీ ఖమేనీకి ఎక్కడిది?

స్టార్లింక్ ఉపగ్రహాలను జామ్ చేసిన ఇరాన్.. మిలిటరీ గ్రేడ్ టెక్నాలజీ  ఖమేనీకి ఎక్కడిది?

ఇరాన్ లో నిరసనలు మరింత ఉధృతం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఇప్పటివరకు 250 మంది నిరసనకారులు చనిపోయారు. వేలల్లో ఆందోళకారులు అరెస్ట్ అయ్యారు. అల్లర్లు ఉదృతం అవుతున్న క్రమంలో ఆయాతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం ఇప్పటివకే ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. అయితే ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ను ఆందోళనకారులు వినియోగిస్తుండటంతో.. మిలిటరీ-గ్రేడ్ జామింగ్ పరికరాలను వినియోగించి స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ ను సైతం బ్లాక్ చేసింది. దీంతో దాదాపు 80మిలియన్ల ప్రజలు  డిజిటల్ అంధకారంలో మునిగిపోయారు. 

ఇరాన్ లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా  నిరసనలు 18 వరోజుకు చేరాయి. ఈ క్రమంలో నిరసనలను కట్టడిచేసేందుకు మిలిటరీ గ్రేడ్ కిల్ స్విచ్ ను వినియోగించిందని తెలుస్తోంది. నిరసనలు ఉదృతం అవుతున్న క్రమంలో మొదటి ఇంటర్నెట్ బ్లాక్ చేసింది. అయితే ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ను ప్లాన్ బి గా ఎంచుకున్నారు నిరసనకారులు. స్టార్ లింక్ ద్వారా మేసేజ్ లు , ఆందోళనకు సంబంధించినఫొటోలు  షేర్ చేశారు. స్టార్ లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్న ఖమేనీ ప్రభుత్వం.. అత్యంత శక్తివంతమైన  ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ను కూడా బ్లాక్ చేసింది. స్టార్ లింక్ సేవలను బ్లాక్ చేసేందుకు మిలిటరీ గ్రేడ్ జామర్లను వినియోగించడంతో  ఆ పరికరాలు ఇరాన్ కు ఎక్కడినుంచి వచ్చాయనేది  ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

►ALSO READ | అమెరికాలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడి కాల్చివేత

స్టార్ లింక్ అప్ లింక్, డౌన్ లింక్ ట్రాఫిక్ లో మొదట 30శాతమే అంతరాయం ఏర్పడినప్పటికీ ప్రస్తుతం 80శాతం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. స్టార్ లింక్ ఉపగ్రహాలను  జామ్ చేసేందుకు కిల్ స్విచ్ ను ఉపయోగించిందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అత్యంత ఖరీదైన మిలిటరీ గ్రేడ్ జామింగ్  పరికరాలను వినియోగించి స్టార్ లింక్ ఇంటర్నెట్ ను అడ్డుకున్నట్లు చెబుతున్నారు. రష్యా లేదా చైనా  దేశాల్లో ఏదో ఒకటి సరఫరా చేసి ఉండొచ్చని చెబుతున్నారు. 

అయితే ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణపై ఎలాన్ మస్క్ తో మాట్లాడాలని యోచిస్టున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇరాన్ అల్లర్లపై పదేపదే ఖమేనీ హెచ్చరిస్తున్న ట్రంప్.. ఇరాన్ పై దాడికి దిగేందుకు ట్రంప్ సిద్దమవుతుండగా.. ఇరాన్ లో అల్లర్లకు కొన్ని విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి.. ఇరాన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే  మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్  హెచ్చరించడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.