స్పీఫెన్ హాకింగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. గగనాంతరాళంలో ఏముందో.. గ్రహాంతర వాసుల ఉనికి మొదలైన ఎన్నో అంశాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త. వీల్ చైర్ లో కూర్చుని ఎటూ కదలలేని స్థితిలో ఉండే ఈ సైంటిస్ట్ పేరు ఇప్పుడు ఎప్ స్టీన్ ఫైల్స్ లో రావటం సంచలనంగా మారింది. స్విమ్మింగ్ పూల్ లేదా రిసార్ట్ లో.. రెండు వైపులా బికినీ ధరించిన అమ్మాయిలతో ఉన్న ఈ ఫోటో ఫుల్ వైరల్ గా మారింది. ఎటూ కదలలేని వ్యక్తి ఈ వ్యవహారంలో ఎలా చిక్కుకున్నాడా..? అనే ప్రశ్న సహజంగా ఎవరికైనా కలగక మానదు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ రొంపిలో ఇప్పటికే.. వివిధ దేశాధ్యక్షులు, వ్యాపార దిగ్గజాలు, టెక్ జెయింట్స్, సెలబ్రిటీలు.. ఇలా ఎందరో ఇరుక్కుని తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వివాదాస్పద వ్యభిచార కూపానికి సంబంధించిన ఫైల్స్ లో హాకింగ్ ఉండటమేంటని సోషల్ మీడియాలో ఒకటే ప్రశ్నలు.
ఇద్దరు బికినీలు వేసుకున్న మహిళల మధ్య హాకింగ్ నవ్వుతూ ఉన్న ఫోటో.. ఎప్ స్టీన్ ఫైల్స్ లో బయటపడటంపై ఆయన కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. జెఫరీ ఎప్ స్టీన్ కు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లలో ఉన్న ఆ ఫోటో ఆ వ్యవహారానికి సబంధించినది కాదని పేర్కొన్నారు. ఆ ఫోటో 2006 లో కరీబియన్ ఐలండ్ లోని రిట్జ్ కార్ల్ టన్ లో తీసిందని చెప్పారు. క్వాంటం కాస్మాలజీపై ప్రొఫెసర్ హాకింగ్స్ స్పీచ్ ఇచ్చిన సందర్భంగా తీసిన ఫోటో అది అని తెలిపారు.
హాకింగ్స్ పక్కన ఉన్నది ఎప్ స్టీన్ బాగోతంలో ఉన్న అమ్మాయిలు కాదని.. ఆయనకు ఎన్నో ఏళ్లుగా సేవలు చేసిన యూకేకు చెందిన వారని తెలిపారు. ఆయన గురించి చెడుగా ప్రచారం చేయడం పద్ధతి కాదని సూచించారు.
2006 మార్చిలో సెయింట్ థామస్ ఐలండ్ లో ఎప్ స్టీన్ నిర్వహించిన ఈవెంట్ లో.. హాకింగ్ తో పాటు 21 మంది అంతర్జాతీయ సైంటిస్టులు పాల్గొన్నట్లు తెలిపారు. ఎప్ స్టీన్ పై మొదట చార్జ్ వేయటానికి 5 నెలల ముందు ఆ కాన్ఫరెన్స్ జరిగినట్లు చెప్పారు.
అయితే US న్యాయ శాఖకు సంబంధించిన ఎప్స్టీన్ ఫైళ్ల రికార్డ్స్ లో హాకింగ్ పేరు చాలాసార్లు కనిపించింది, ఇందులో కోర్టు పత్రాలు, కమ్యూనికేషన్ రికార్డులు, సంప్రదింపు వివరాలు, లైంగిక నేరస్థుడు ఎప్ స్టీన్ తో ముడిపడి ఉన్న ఇతర మెటీరియల్స్ ఉన్నాయి.
ప్రొఫెసర్ హాకింగ్స్ 2018లో 76 సంవత్సరాల వయస్సులో 50 సంవత్సరాలకు పైగా అమియొట్రోఫిక్ లేటరల్ క్లెరోసిస్ (ALS) అనే న్యూరో డిజార్డర్ తో పోరాడి మరణించాడు. ఆయనపై ఆరోపణలు చేయడం మానుకోవాలని ఫ్యామిలీ మెంబర్స్ హెచ్చరిస్తున్నారు.
