బురద అగ్ని పర్వతం పేలడం ఎప్పుడైనా చూశారా?.. పేలితే ఏం జరగుతుందో తెలుసా?..అగ్ని పర్వతం పేలితే ఎట్లుంటుందో మనందరికి తెలుసు. పర్వతం లోపల ఉన్న ఉష్ణ లావా బయటకు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలను కప్పేస్తుంది. నిప్పులు కక్కుతూ లావా ప్రవహించి లెక్కించలేనంత టెంపరేచర్ తో సమపీంలో ఇళ్లు, చెట్లు, పంటలు నాశనం చేస్తుంది. కానీ మడ్ అగ్ని పర్వతం పేలితే అలా కాదు. బురద అగ్ని పర్వతం సాధారణ లావా అగ్ని పర్వతం లాంటిది కాదు. ఇందులో మాగ్మా (లావా) కాకుండా, నేలలోని బురద, నీరు, మీథేన్ వంటి గ్యాస్ బయటకు ఉబికి వస్తాయి.
బుధవారం, ఫిబ్రవరి 25న కొలంబియాలోని శాన్ జువాన్ డి ఉరాబాలో భారీ మట్టి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఫలితంగా సమీప ప్రాంతాల్లోని అడవుల్లో అనేక జంతువులు మృతిచెందాయి. సమీపంలోని రోడ్లు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీంలు ఘటనస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు అక్కడి ప్రజలకు ఎలాంటి హానీ జరగలేదు. ఈ బురద అగ్నిపర్వతం పేలిన దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బంధించి షేర్ చేశారు.
బురద అగ్ని పర్వతం పేలినప్పుడు లావా అగ్నిపర్వతం లాగే పెద్ద ఎత్తున మంటలతో పెద్ద శబ్ధంతో సంభవించిందని స్థానికులు వీడియోలతో షేర్ చేశారు. అయితే లావా అత్యధిక ఉష్ణోగ్రతలతో సమీప ప్రాంతాలను దహనం చేస్తుంది. అత్యధిక వేడిని వెదలజల్లుతుంది. దీనికి భిన్నంగా బురదఅగ్నిపర్వత విస్ఫోటనం బురద, నీరు, మీథేన్ లాంటి గ్యాస్ బయటికి ఉబికి వచ్చాయి.
భూమి లోపల ఒత్తిడి పెరిగితే బురద పైకి ఎగసి చుట్టుపక్కల ప్రాంతాలను కప్పేస్తుంది. ఇళ్లు, పంటలు, రోడ్లు మునిగిపోవచ్చు.మీథేన్ వంటి వాయువులు బయటకు వస్తాయి. ఇవి మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు లావా అగ్ని పర్వతం పేలితే అత్యధిక ఉష్ణోగ్రతలతో లావా సమీపం ప్రాంతాలను దహనం చేస్తుంది. అయితే బురద అగ్నిపర్వతం పేలితే ఆ ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
►ALSO READ | బాస్ కి GenZ ఎంప్లాయ్ రివర్స్ షాక్! లీవ్ క్యాన్సిల్ చేస్తే 'ఐ డోంట్ కేర్' అంటూ దిమ్మతిరిగే ఆన్సర్...
ఇలాంటిదే మన దేశంలోకూడా సంభవించింది. 2005 లో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని ఏకైక బురద అగ్నిపర్వతం (Mud Volcano) బద్దలైంది. ఈ పేలుడులో సుమారు 3-4 మీటర్ల ఎత్తైన మట్టి దిబ్బ ఏర్పడి, 1000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో బురద వ్యాపించింది. ఈ అగ్నిపర్వతం నుండి భారీగా బురద, వాయువులు, పొగలు వెలువడ్డాయి.
భూమి లోపలి పొరల్లో ఒత్తిడి వల్ల మట్టి, వాయువులు (ముఖ్యంగా మీథేన్) బయటకు రావడం ద్వారా ఇది సంభవిస్తుంది.లావా వచ్చే అగ్నిపర్వతాలలా కాకుండా, వీటి నుండి మట్టి వాయువులు మాత్రమే వస్తాయి.ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వత పరిసర ప్రాంతాల్లోకి రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
⚡️MUD VOLCANO ERUPTS in San Juan de Urabá, Colombia
— RT (@RT_com) February 26, 2026
Residents EVACUATED pic.twitter.com/AXsRkGQGvQ
